చెల్లా చెదురుగా ఉన్న మేదరులదరిని ఒక తాటి మీదకు తెచ్చి వారందరినీ చైతన్య పరిచి, విద్య ఉద్యోగ రంగాలలో ముందుకు వెళ్లే విధంగా మహేంద్ర జ్యోతి పత్రిక పని చేసింది. నేటి తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షుడు శ్రీ కె.వేంకట రాముడు గారు సంపాదకులుగా వెలుబడిన ఆ మాస పత్రిక మహేంద్ర కులస్తులను బుజం తట్టి లేపింది. అంత కన్నా ముందు పాతకోటి రంగనాయకులు గారి సారధ్యంలో మహేంద్ర వాణి అనే మాస పత్రిక వచ్చింది కాలం మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేంద్ర బంధువులకు సమాచారం అందించటానికి తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో ఈ website ప్రారంభిస్తున్నాము.
జాతి పట్ల మక్కువ తో ఈ website చూస్తున్న మీకు స్వాగతం.. సుస్వాగతం