జిల్లా కమిటీలు ఏమి పని చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా మేదరి సంఘాన్ని నిర్మించే క్రమంలో మన పెద్దలు నాలుగు అంచేల కమిటీలను ఏర్పాటు చేశారు.

1. గ్రామ కమిటీ.
2. మండల కమిటీ.
3. జిల్లా కమిటీ.
4. రాష్ట్ర కమిటీ.

ఇందులో జిల్లా కమిటీ పాత్ర కీలకమైనది.  మానవ శరీరంలో సిరలు, ధమనులు అనే రక్త నాళాలు ఉంటాయి. కొన్ని గుండె నుండి శరీరమంతా శుద్ది చేసిన రక్తాన్ని  తీసుకు వెళ్తుంటాయి. మరి కొన్ని శరీరం లోని అన్ని బాగాల నుండి రక్తాన్ని శుద్ధి చేయడం కోసం గుండెకు తీసుకు వస్తుంటాయి. అపుడు మాత్రమే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.లేక పోతే గుండె నొప్పి వస్తుంది. పక్ష వాతం వస్తుంది. అలాగే సంఘం కూడా. ఆరోగ్యంగా ఉండాలి ఏ కమిటీ చేసే పనులు ఆ  కమిటీలు చేయాలి.

గ్రామం లోని సాధారణ సభ్యుడి ఆలోచన, ఆవేదన జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి తెలియాలి. రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయాలు గ్రామ స్థాయి వరకు తీసుకు వెళ్లి అమలు చేయాలి.  “ఇందులో జిల్లా కమిటీల పాత్ర కీలకమైనది.”

  • జిల్లా కమిటీ సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒక సారి క్రమం తప్పకుండా నిర్వహించాలి. అధ్యక్షులు వారిని సంప్రదించి ప్రధాన కార్యదర్శి తేదీ నిర్ణయించి సమయం, స్థలం, ఏజెండా అంశములు తెలియచేస్తూ నోటీస్ ఇవ్వాలి.
  • జిల్లా కమిటీకి మినిట్స్ బుక్, అకౌంట్ బుక్, రశీదు బుక్ తప్పనిసరిగా ఉండాలి.
  • సంవత్సరం కు ఒక సారి జిల్లాలో ఏదో ఒక చోట గానీ, జిల్లా కేంద్రం లో గాని సర్వ సభ్య సమావేశాలు నిర్వహించాలి. ఆ సమావేశానికి రాష్ట్ర నాయకత్వం కు తెలియాపరిచి ఆహ్వానించాలి.
  • జిల్లా కేంద్రం లో సంఘ భవనం కు అవసరమైన స్తల సేకరణ చేయాలి.M.P,  MLA ల నుండి నిధులు సేకరించి సంఘం భవనం నిర్మించాలి.
  • వసూలు చేసే ప్రతి పైసా కు రశీదు ఇవ్వాలి.జమ.ఖర్చులు సర్వ సభ్య సమావేశం లో ఆమోదం పొందాలి.
  • జిల్లాలో అనుబంధ కమిటీలు వేయాలి
  •   ⇔ మహేంద్ర యువజన సంఘం.                 
  •  ⇒ మహేంద్ర మహిళ సంఘం. 
  • ⇒ మహేంద్ర ఉద్యోగుల సంఘంల తో పాటుఇతర అనుబంధ కమిటీలు వేయాలి.
  • జిల్లాలోని ఇతర బిసి సామాజిక వర్గాల తో కలిసి పనిచేస్తూ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. సంచార జాతులు, ఏంబిసిలు, బిసి ల సమస్యల సాధన కోసం సాగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. మన తరుపున వాయిస్ వినిపించాలి.
  • బిసి కార్పొరేషన్, జిల్లా కలెక్టర్, కో ఆపరేటివ్ ఆఫీస్ లకు వెళ్ళడం ప్రభుత్వం ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడానికి కృషి చేయాలి.
  • జిల్లాకు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ వచ్చిన సందర్భాలలో మన సమస్యల పైన ఒక బృందంగా వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి. ఆతరువాత సంభందిత అధికారులను కలిసి ఫాలో చేయాలి.
  • మనం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి ప్రతి పక్షాల దృష్టికి తీసుకు వెళ్ళడం కోసం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ను బాగా వాడుకోవాలి.సోషల్ మీడియాలో కూడా మన వారిని చైతన్య పరచాలి.
  • జిల్లాలో దేవాలయాల ఉంటే వాటి జాతరలు జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో జరుపాలి. కౌటాల లో లేత బొంగులా జాతర, మహబూబ్ నగర్ లో కంకాలమ్మ్మ జాతర, కొలనుపాక లో శివ రాత్రి ఉత్సవాలు, మన్ననురు, కల్వకుర్తి, హైదరాబాద్ లో అమ్మ వారి గుడి ఉత్సవాలు లాంటివి నిర్వహించాలి. స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుంది మానవ సంభంధాలు మెరుగుపడతాయి ఇచి పుచ్చుకునే ధోరణి పెరుగుతుంది.
  • జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి,  కోశాధికారి,  ప్రచార కార్యదర్శి వంటి భాద్యతలు నిర్వహించే వారు చాలా ఓపికగా  వ్యవహరించాలి. పంతాలు, పట్టింపు లకు పోయి సమస్యను మరింత జటిలం చేయరాదు. ప్రతిభ ఉన్నవారిని అభినందించాలి. తప్పు చేసిన వారిని సున్నితంగా మండలించాలి.
  • మన కులస్తుల మద్యన ఏమైనా  తగాదాలు వచ్చినట్లయితే ఇరు వైపులా వాదన విని పరిష్కరించాలి.
  • జిల్లాలో పోటి పరీక్షలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి, మంచి ఉద్యోగాలు సాధించిన వారిని ఉన్నత చదువులు చదివిన వారిని గుర్తించి వారిని అభినందించాలి .కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల వారు ఇప్పటికే ఈ కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నారు. రిటైర్ ఉద్యోగులను వారి సేవలను, వారికి యొక్క అనుభవాలను సంఘ నిర్మాణంలో వినియోగించుకోవలి వారితో చర్చించి వారికి ఆసక్తి గల భాధ్యత అప్పగించాలి.                                      
Translate »

Welcome

Official Website